15 ఏండ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్,నో డీజిల్..ఏప్రిల్ 1 నుంచి అమలు

15 ఏండ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్,నో డీజిల్..ఏప్రిల్ 1 నుంచి అమలు
  • ఢిల్లీ సర్కారు నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేండ్లు దాటిన వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ పోయ కూడదని డిసైడ్  అయింది. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలపై పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం అధికారులతో సమావేశం అయ్యారు. 

కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చర్చించారు. పదిహేనేండ్లు దాటిన వాహనాలు, యాంటీ స్మోగ్ చర్యలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ పోర్టేషన్ కు మారేలా ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపైనా మాట్లాడుకున్నారు. 

అనంతరం మీడియాతో మంత్రి సిర్సా మాట్లాడారు. ‘‘పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక గ్యాడ్జెట్లు ఇన్ స్టాల్ చేసి కాలం చెల్లిన వాహనాలను గుర్తించే ఏర్పాట్లు చేస్తం. ఆ వాహనాలకు ఇంధనం పోయరు. దీనిపై త్వరలో కేంద్ర పెట్రోలియం శాఖకు నోటిఫై చేస్తాం” అని సిర్సా పేర్కొన్నారు.