మేడ్చల్ హత్య: తాగొచ్చి లొల్లి చేస్తుండని.. అన్నను పట్టపగలు నడిరోడ్డుపై చంపేసిన తమ్ముళ్లు

మేడ్చల్ హత్య: తాగొచ్చి లొల్లి చేస్తుండని.. అన్నను పట్టపగలు నడిరోడ్డుపై చంపేసిన తమ్ముళ్లు

హైదరాబాద్ మేడ్చల్ లో పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో ఒక వ్యక్తిని చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఉమేష్ అనే వ్యక్తిని సినిమాను తలపించేలా కత్తులతో పొడిచి చంపీ.. రోడ్డుపై నుండి నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలిసింది. సొంత అన్నను తమ్ముడు, వరుసకు తమ్ముడయ్యే మరో యువకుడు కలిసి కత్తులతో కసి తీర పొడిచి దారుణంగా హత్య చేశారు.   ఈ హత్యకు కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. 

మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారం పేటకు చెందిన గన్యా మేడ్చల్  ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా మేడ్చల్ లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఉమేష్, రాకేష్ అనే ఇద్దురు కొడుకులు ఉన్నారు. 

పెద్ద కొడుకు ఉమేష్ గత కొద్ది రోజులుగా ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో వచ్చి తల్లిని కొట్టి వేధింపులకు గురి చేస్తున్నాడని విసిగిన రాకేష్.. బంధువుల అబ్బాయి లక్ష్మణ్ తో కలిసి ఇద్దరు ఉమేష్ తో గొడవ పడ్డారు. అతను తప్పించుకుని జాతీయ రహదారిపైకి రావడంతో అక్కడే కింద పడేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. 

నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉమేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.