భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్

భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్‌‌‌‌‌‌ దంపతులను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్‌‌‌‌ రిమాండ్‌‌‌‌ విధించడంతో భద్రాచలం సబ్‌‌‌‌ జైల్‌‌‌‌కు తరలించారు.

ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తూ, పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో బిల్డింగ్‌‌‌‌ కూలి పోవడంతో చల్లా కామేశ్వరరావు, పడిశాల ఉపేందర్‌‌‌‌రావు అనే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భవన యజమానాలను అరెస్ట్‌‌‌‌ చేశారు.