- నిరవధిక సమ్మె షురూ
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి ప్రభావిత గ్రామాల యువతను సింగరేణి యాజమాన్యం ఉపాధి పేరుతో ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ సింగరేణి వ్యాప్తంగా కన్వేయన్స్వెహికల్స్ ఓనర్లు సమ్మెకు దిగారు. గురువారం బెల్లంపల్లి రీజియన్పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో, జైపూర్ సింగరేణి థర్మల్పవర్ప్లాంట్లో కన్వేయన్స్వెహికల్స్ఓనర్లు తమ వాహనాలను ఆయా జీఎం ఆఫీస్‌ల ముందు నిలిపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఓనర్లు మాట్లాడుతూ.. భూ నిర్వాసితులు, సమీప గ్రామాల ప్రజలు, మాజీ ఉద్యోగులు, కార్మికుల పిల్లలు అద్దె వెహికల్స్ పెట్టుకునేందుకు ఛాన్స్ఇచ్చిన సింగరేణి యాజమాన్యం వారికి అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
సంస్థలో వెహికల్స్ పెట్టి అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందారు. తమకు సీఎంపీఎఫ్ లో కోత లేకుండా చూడాలని, 2017 నుంచి యూనిట్రేట్పెంచాలని ఉద్యమిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. టెండర్ కాలపరిమతి ఆరేళ్లకు పొడిగించాలని, అదనంగా కిలోమీటర్‌కు రూ.20 పెంచాలని డిమాండ్‌చేశారు. ఈ సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా 4వేల వెహికల్స్నడవలేదు. దీంతో జీఎం ఆఫీస్, బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లలో డ్యూటీలకు వెళ్లే జీఎం నుంచి కింది స్థాయి ఆఫీసర్లు ఇబ్బందులు పడ్డారు. సొంత, ప్రైవేటు వెహికల్స్‌లో డ్యూటీలకు వచ్చారు.