కబ్జాదారుల నుంచి మా ప్లాట్లను కాపాడండి

కబ్జాదారుల నుంచి మా ప్లాట్లను కాపాడండి

పెబ్బేరు, వెలుగు: కబ్జాదారుల నుంచి తమ ప్లాట్లను కాపాడాలని బాధిత ప్లాట్ల యజమానులు పెబ్బేరు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చి వేడుకున్నారు. ఈ సందర్భంగా బాధిత ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ 15 ఏండ్ల కింద సర్వే నంబరు 458లోని కనకదుర్గ, శ్రీనివాస పేరిట ఏర్పాటు చేసిన వెంచర్లలో పట్టణానికి చెందిన సుమారు 450 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు.

కాగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ముగ్గురు సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 458తోపాటు 545, 555  సర్వే నంబర్లను కూడా కలుపుకొని మొత్తం 13.39 ఎకరాలు మాఫీ ఇనామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమి అంటూ వనపర్తి ఆర్డీవోకు అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారన్నారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆర్డీవో హియరింగ్ నిర్వహించి హైదరాబాద్ వాసులకు ఆ భూమి చెందేలా ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ కోసం పెబ్బేరు తహసీల్దార్​కు పంపించారని అన్నారు. ఈ నిర్ణయంపై విచారణ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ గౌడ్, పరుశరాముడు, మైబు, శివారెడ్డి, ఎల్ల స్వామి, వెంకటేష్, నాగేశ్వర్ రెడ్డి, నిజాముద్దీన్, సర్వేష్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.