కబేళాకు నృసింహస్వామి కోడెలు

కబేళాకు నృసింహస్వామి కోడెలు

మంగపేట, వెలుగు: దేవాలయానికి భక్తులు సమర్పించిన కోడెలను ఆలయ సిబ్బంది కబేళాలకు అమ్మేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారులోని హేమాచల క్షేత్రంపై స్వయంభూగా వెలిసిన శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామికి కల్యాణం సందర్భంగా రెండు కోడెలను సమర్పించారు. దేవస్థానం సిబ్బంది కోడెలను వేలంపాట ద్వారా అమ్మడం లేదంటే గోశాలకు అందజేయాలి.

కానీ, ఆలయ సిబ్బంది కోడెలను కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి రూ.7,800 అమ్మి రసీదు సైతం అతడి పేరున ఇచ్చారు. కోడెలను అమ్మిన విషయం   గ్రామస్తులకు తెలియడంతో ఇన్​చార్జి ఈవో మహేశ్​ వాటిని తిరిగి దేవస్థానానికి తెప్పించారు. దేవస్థానం ఇన్​చార్జి ఈవోను వివరణ కోరగా, కోడెలను అమ్మిన విషయం నిజమేనని, నిబంధనలకు విరుద్ధంగా అన్య మతస్తుడికి అమ్మిన వారికి నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు.