ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు బ్రేక్ పడింది. దాంతో కరోనా వ్యాక్సిన్ రేసులో ముందున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు టెంపరరీగా బ్రేకులు పడ్డాయి. లండన్‌లో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీరుకు అంతుచిక్కని అనారోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆస్ట్రా జెనెకా ఫార్మా కంపెనీ ట్రయల్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకున్న వారి భద్రతపై సమీక్ష చేస్తామని తెలిపింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయో మాత్రం చెప్పలేదు. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. క్లినకల్ ట్రయల్స్ దాదాపుగా అయిపోవొచ్చాయి. ఇంతలోనే ఓ వ్యక్తికి అనారోగ్యం రావడంతో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు బ్రేకులు పడ్డాయి.
వ్యాక్సిన్ ట్రయల్స్ చివరిదశలో ఉన్న 9 కంపెనీలలో ఆస్ట్రాజెనెకా ఒకటి. ఈ కంపెనీ అమెరికాలో ఆగస్టు 31న వివిధ ప్రాంతాలలో 30,000 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ను ఇచ్చింది. AZD1222 అని పిలువబడే ఈ టీకా.. సాధారణ జలుబుకు కారణమయ్యే అడెనోవైరస్‌ను నియంత్రిస్తుంది. ఇది కరోనావైరస్‌పై ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడుతుంది. టీకాలు వేసిన తరువాత ఈ ప్రోటీన్ మానవ శరీరం లోపల ఉత్పత్తి అవుతుంది. టీకాలు వేసిన తర్వాత కరోనా సోకినట్లయితే.. ఇది రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
For More News..