
రితేష్ అగర్వాల్ సంపద రూ. 7,800 కోట్లు
న్యూఢిల్లీ: ఓయో హోటల్ చెయిన్ ప్రారంభించిన ఆరేళ్లలోనే… ఈ కంపెనీ ఫౌండర్ రితేష్ అగర్వాల్ ప్రపంచంలోనే రెండో యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలీనియర్‌గా నిలిచారు. రూ.7,800 కోట్ల సంపదతో ఆయన ఈ టైటిల్‌ను సంపాదించుకున్నారు. హురున్ గ్లోబల్ విడుదల చేసిన రిచ్ లిస్ట్ 2020లో ఈ విషయం వెల్లడైంది. ఓయోపై పెద్ద ఎత్తున నెగిటివ్ పబ్లిసిటీ ఉన్నప్పటికీ… దాని ఫౌండర్ రితేష్(24)కు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. కాస్మోటిక్స్ క్వీన్ కైలీ జెన్నర్(22) కూడా యంగస్ట్ సెల్ఫ్ మేడ్ బిలీనియర్ టైటిల్‌ను హురున్ రిచ్ లిస్ట్‌లో దక్కించుకున్నారు. ఇండియాలో రితేష్ 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఇండియన్‌గా ఉన్నారు. జెరోధా ఫౌండర్స్ నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లు కూడా ఇండియా రిచెస్ట్ యంగ్ సెల్ఫ్ మేడ్ బిలీనియర్ల జాబితాలో ఉన్నారు. రితేష్ సక్సెస్‌ను చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన్ను అభినందించారు. ఇండియా పర్యటనకు వచ్చిన ట్రంప్, ఇండియన్ బిజినెస్ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రితేష్‌తో మాట్లాడారు. ‘నీ కంపెనీ నాకు తెలుసు, నీది చిన్న కంపెనీ కాదు. నీవు చేస్తున్నది గుడ్ జాబ్’ అని ట్రంప్, రితేష్‌ను పొగిడారు. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో అమెరికాలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని ట్రంప్ అంచనావేస్తున్నట్టు రితేష్ చెప్పారు. టెక్సాస్, లూసియానా, నార్త్ డకోటాలో వేల కొద్దీ ఉద్యోగాలు క్రియేట్ చేయడం వంటి వాటిపై త్వరలోనే ఇవాంకతో కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నామని రితేష్ తెలిపారు. ప్రెసిడెంట్‌కు ఇవాంక ట్రంప్ సీనియర్ అడ్వయిజర్‌గా ఉన్నారు. అమెరికాలో రితేష్ 313 హోటల్స్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తంగా 800కి పైగా నగరాల్లో 23 వేలకు పైగా ఓయో బ్రాండెడ్ హోటల్స్‌ను,8,50,000 రూమ్స్‌ను నిర్వహిస్తోంది. ఓయోను 2013లో సాఫ్ట్‌బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద హోటల్ చెయిన్‌గా ఉంది. దీని వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్లుగా ఉంది.
For More News..