పండగే పండగ.. ఐదు రోజులు ఓయో రూమ్స్ ఫ్రీ.. డీటెయిల్స్ ఇవిగో

పండగే పండగ.. ఐదు రోజులు ఓయో రూమ్స్ ఫ్రీ.. డీటెయిల్స్ ఇవిగో

ఓయో కంపెనీ కస్టమర్స్ కు పండగ లాంటి వార్త చెప్పింది. ఫ్రీక్వెంట్ గా స్టే చేసే వారి కోసం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక ఐదు రోజులు ఓయో ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా రూమ్ ఫ్రీగా బుక్ చేసుకుని స్టే చేయొచ్చని అనౌన్స్ చేసింది. మొత్తం వెయ్యి హోటల్స్ లో ఈ ఆఫర్ ఇస్తోంది. ప్రీమియం, బడ్జెట్, టౌన్ హౌజ్.. ఇలా దాదాపు అన్ని సర్వీసెస్ ను ఫ్రీగా ఇస్తోంది ఓయో. 

‘‘ఈ వీకెండ్ ను చాలా గొప్పగా ఎవిరీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకునేలా, కలిసి ఉంటూ, మెమరీస్ ఎప్పటికీ ఉండేలా సెలబ్రేట్ చేసుకుందాం. అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది..? ప్రయాణం చేయడం, ఇష్టమైన వాళ్లని కలవడంతో మూమెంట్స్ ను సొంతం చేసుకోండి’’ అంటూ ఓయో కంపెనీ ఫౌండర్ రితేశ్ అగర్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.  ఇండియా చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ, హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోండంటూ ఆఫర్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. 

Also Read:-ఒక్క రోజులోనే అన్ని కోట్ల పేమెంట్సా...?

‘‘హోలీ పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ వెంట పడుతూ.. రంగులు చల్లుతూ అల్లరి అల్లరిగా సెలబ్రేట్ చేసుకోండి. లైఫ్ అంటే జస్ట్ ఫన్, ఫ్యామిలీ, సెలబ్రేషన్’’ అని.. అలాంటి సెలబ్రేషన్ మూడ్ లో కస్టమర్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. మార్చి 13 నుంచి 18 వరకు ప్రతి రోజూ ఓయో ఫ్రీ గా బుక్ చేసుకుని స్టే చేయండని ఆఫర్ గురించి చెప్పాడు. 

మొత్తం 1000 హోటల్స్ లో ఫ్రీ ఆఫర్ ఉంటుందని అనౌన్స్ చేసిన రితేష్.. కూపన్ కోడ్ ఎంటర్ చేసి ఈ ఆఫర్ అందుకోవాలని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కానుకగా చాంపియన్ అని కూపన్ కోడ్ ను బుకింగ్ టైం లో ఎంట్రీ చేయడం వలన ఆఫర్ పొందవచ్చు. ఇంగ్లీష్ క్యాపిటల్ లెట్టర్స్ లో CHAMPION అపూ కూపన్ కోడ్ ను బుకింగ్ చేసుకుంటడగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓయో వెబ్ సైట్ లో ఈ కూపన్ కోడ్ తో బుకింగ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని షేర్ చేశాడు. 

డెయిలీ 2 వేల ఫ్రీ స్టే ఆఫర్ ఇస్తోంది కంపెనీ. అంటే ఫస్ట్ బుక్ చేసుకున్న 2000 మందికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫస్ట్ రెండు వేల మందిలో మీరు ఉంటే మీకు ఆఫర్ తగిలినట్లే. మీరు కూడా ట్రావెలింగ్ లో ఉన్నా.. ఫ్రెండ్స్ తో గ్యాదర్ అయినా.. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా.. ఇంకేదైనా ఈ ఆఫర్ ను వినియోగించుకోండి. 

మిగతా వివరాల కోసం కంపెనీ వెబ్ సైట్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి: t.co/ZE84JQ5nTE