6 రెట్లు పెరిగిన ఓయో లాభం

6 రెట్లు పెరిగిన ఓయో లాభం

న్యూఢిల్లీ: ఓయోకి కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.166 కోట్ల నికర లాభం వచ్చింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.25 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది ఆరు రెట్ల కంటే ఎక్కువ. కంపెనీ రెవెన్యూ 31 శాతం వృద్ధి చెంది రూ.1,296 కోట్ల నుంచి రూ.1,695 కోట్లకు చేరుకుంది.   క్యూ3లో  రూ.3,341 కోట్ల హోటల్‌‌ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓయో సాధించింది.  

2023 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన రూ.2,510 కోట్ల బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా కొనుగోలు చేసిన అమెరికన్ కంపెనీ  జీ6  రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ఓయో ఫలితాల్లో కలిసి లేవు.  కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓయోకి రూ. 457 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ  రూ.111 కోట్లు నష్టపోయింది.