రామగుండం లయన్స్​ క్లబ్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మల్లికార్జున్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం లయన్స్​ క్లబ్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పి.మల్లికార్జున్​, సెక్రటరీగా ఎల్లప్ప, ట్రెజరర్​గా పి.గోవర్ధన్​ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం స్థానిక లయన్స్​ భవన్​లో క్లబ్​ మాజీ గవర్నర్​ ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన ఎన్నిక మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. క్లబ్​ ఉపాధ్యక్షులుగా పి.ఆంజనేయులు, ఎల్.భిక్షపతి, బి.కళావతి, కోఆర్డినేటర్లుగా ఎం.గంగాధర్, బంక రామస్వామి, మనోజ్​ కుమార్​అగర్వాల్​, అడ్మినిస్ట్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తిలక్​ చక్రవర్తి తదితరులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ప్రమోద్​కుమార్​ రెడ్డి మాట్లాడుతూ రామగుండం లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి, కళావతి ట్రస్ట్​ ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను తయారు చేసి అందిస్తున్నామని తెలిపారు. మల్లికార్జున్​ మాట్లాడుతూ క్లబ్​ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు.