
ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ తనపై వస్తున్న ఆరోపణలను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఖండించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎన్నికల సమయంలో కొందరు తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కేసుపై 2016 లోనే పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, నిజా నిజాలు త్వరలోనే బయటపడతాయని ఆయన అన్నారు. ఈ రాజకీయ కుట్ర వెనక ఉన్న వ్యక్తులు ఎవరో బయట పెడతామని తెలిపారు. కాగా ఈ ఫోర్జరీ విషయంపై.. మురళీధర్ రావుతో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.