గోదావరిఖని, వెలుగు : పరిశ్రమలు ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మధ్యప్రదేశ్ ఇండస్ట్రీస్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి కోరారు. శనివారం గోదావరిఖని సరస్వతీ శిశుమందిర్ స్కూల్ ఆవరణలో భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల ప్రారంభానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను నెలకొల్పేవారిని ప్రోత్సహించాలన్నారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పెరగాలంటే పరిశ్రమల స్థాపనతో పాటు ఉద్యోగాల సంఖ్య పెరగాలన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో బీఎంఎస్ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమార్పాండే, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.రవీందర్రాజ్వర్మ, ఆర్ఎస్ఎస్ తెలంగాణ కార్యదర్శి కాచం రమేశ్, దక్షిణ ప్రాంత సంఘటనా కార్యదర్శి దొరై రాజు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం, రాష్ట్ర జనరల్ సెక్రటరీ తూర్పు రాంరెడ్డి
సింగరేణి యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, లీడర్లు బూర్ల లక్ష్మీనారాయణ, కంది శ్రీనివాస్, రమాకాంత్, జె.రాంమోహన్, వడ్డేపల్లి రాంచందర్ అంతకుముందు గోదావరిఖని ఫైవింక్లయిన్ పార్క్‌నుంచి మెయిన్ చౌరస్తా వరకు బీఎంఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
Madhya Pradesh Industries Department Principal Secretary P. Narahari requested that the unemployed will get job opportunities with the establishment of industries