
షాద్ నగర్, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు యూట్యూబర్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌పార్టీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పి.రఘు విమర్శించారు. మంగళవారం షాద్ నగర్లో సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు చేసిన కామెంట్లపై రఘు స్పందించారు. వెళ్లిన పనిని పక్కనపెట్టి రేవంత్‌రెడ్డిపై లేనిపోని కామెంట్లు చేశారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో కేసీఆర్జర్నలిస్టులపై ఏ విధంగా విరుచుకుపడ్డారో రాష్ట్రమంతా చూసిందన్నారు. తన యూట్యూబ్చానెల్ద్వారా తీన్మార్ మల్లన్న గతంలో బీఆర్ఎస్ప్రభుత్వ పనితీరును ఎండగడితే ఎన్ని కేసులు పెట్టి వేధించారో గుర్తులేదా అని ప్రశ్నించారు. అసలైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలని సీఎం దూరదృష్టితో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు రాజకీయాలు చేయడం తగదన్నారు.