Subrahmanya Glimpse: ఉత్కంఠ రేపుతోన్న సుబ్రహ్మణ్య గ్లింప్స్.. డైరెక్టర్గా సాయి కుమార్ తమ్ముడు

Subrahmanya Glimpse: ఉత్కంఠ రేపుతోన్న సుబ్రహ్మణ్య గ్లింప్స్.. డైరెక్టర్గా సాయి కుమార్ తమ్ముడు

సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడు, ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ (P Ravi Shankar) తన కొడుకు అద్వయ్‌(Advay)ని హీరోగా పరిచయం చేసేందుకు రెండోసారి మెగాఫోన్ పట్టారు. ‘సుబ్రహ్మణ్య’(Subrahmanya)  టైటిల్‌‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. 

సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ గా వస్తోన్న ఈ సినిమా నుండి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. “సుబ్రహ్మణ్య గ్లింప్స్ – ది ఫస్ట్ అడ్వెంచర్” పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది.

హీరో అద్వాయ్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇందులో విషపూరిత పాములతో నిండిన బావిలోకి అద్వాయ్ దూకడం.. అక్కడ దొంగచాటుగా లోపలికి ప్రవేశించడం..అందులో భాగంగా ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం వంటి సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆ గ్లింప్స్ చివరలో చుట్టూ పాములు సమూహం చేరగా..బ్యాగ్రౌండ్ లో పురాతన ఆలయాన్ని చూపిస్తూ శ్రీరాముడు ని చూపించిన షాట్స్ గ్లింప్స్‌ కే హైలెట్ గా నిలిచాయి. ఇక పి.రవిశంకర్ ..ఈ టీజర్ తోనే  ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. కాగా దుబాయ్‌లో జరిగిన ప్రముఖ సైమా అవార్డు ఫంక్షన్‌లో దక్షిణాది చిత్ర పరిశ్రమ నటీనటుల సమక్షంలో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ ను ప్రదర్శించారు. 

Also Read :- శేఖ‌ర్ బాషా బిగ్‌బాస్ రెమ్యూనరేషన్

విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా వస్తోన్న ఈ ప్రాజెక్టుకి సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.