- నేషనల్ సెక్రటరీగా సురేష్
హైదరాబాద్, వెలుగు: సెపక్తక్రా ఫెడరేషన్ఆఫ్ ఇండియా నేషనల్సెక్రటరీగా పి. సురేష్ ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన యాన్యువల్జనరల్ బాడీ మీటింగ్లో నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫెడరేషన్జాతీయ అధ్యక్షునిగా యోగేంద్రసింగ్దయా, సెక్రటరీగా సురేష్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం సురేష్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు.
ఇంటర్నేషనల్ సెపక్ తక్రా ఫెడరేషన్ (ఐఎస్ టీఏఎఫ్) జనరల్ సెక్రటరీగా అబ్దుల్ హలిమ్ బిన్ ఖాదర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగగా.. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్ రాజ్ ఎన్నికల అబ్జర్వర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి గోవా మాజీ డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కల్వేకర్, వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, జి. శ్రీనివాసులు, తెలంగాణ సెక్రటరీ బి.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.