కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటానికి టికెట్ ఆశించి.. భంగపడిన పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ సెకండ్ లిస్టులో.. పేరు ఉంటుందని ఆశించారు. అందుకు భిన్నంగా పార్టీ అధిష్టానం నిర్ణయం ఉండటంతో షాక్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు విష్ణు.. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో.. ఆ స్థానంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలోకి దింపటంతో.. ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారు విష్ణు.
Also Read : ఎన్నికల పోలింగ్ సమయం 11 గంటలు.. ఇండియాలోనే ఫస్ట్ టైం
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన విష్ణు.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఖరారు కావటంతో.. ఇక బీజేపీ పార్టీలో చేరి.. కమలం గుర్తుపై పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారంట. ఈ మేరకు బీజేపీలో టాక్ నడుస్తుంది. దీనిపై విష్ణు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీలోకి విష్ణు అనే వార్తలు, ప్రచారాన్ని సైతం ఖండించకపోవటం విశేషం.
బీజేపీలోకి చేరతారా లేక స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది ఇంకా క్లారిటీకి రాలేదు. పోటీ చేసేది మాత్రం ఖాయం అంటున్న విష్ణు నిర్ణయం మాత్రం గట్టిగానే ఉంది. అది పార్టీల నుంచా లేక స్వతంత్రంగానే అనేది మరికొన్ని రోజుల్లో ఫైనల్ కానుంది.