SA20: 20 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డ్

SA20: 20 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డ్

టీ20 క్రికెట్ లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో శనివారం (జనవరి 25)ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయడం విశేషం. 140 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ జట్టు ఐదుగురు స్పిన్నర్లను నాలుగు ఓవర్ల పాటు వేయించింది. జో రూట్ , దునిత్ వెల్లలాగే, జార్న్ ఫార్టుయిన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, న్కాబా పీటర్ తలో నాలుగు ఓవర్లు వేశారు. పార్ట్ టైం బౌలర్ రూట్ కూడా నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

స్పిన్ విభాగాన్నే నమ్ముకొని పార్ల్ రాయల్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థి జట్టును 129 పరుగులకే పరిమితం చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 18, 20 వ ఓవర్ రూట్ వేయడం విశేషం. ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ లో ఇన్నింగ్స్ లో మొత్తం 20 ఓవర్లు స్పిన్నర్లు బౌలింగ్ చేసిన తొలి జట్టుగా పార్ల్ రాయల్స్ నిలిచింది. న్కాబా పీటర్ తప్ప మిగిలిన నలుగురు వికెట్లను తీసుకున్నారు. జో రూట్, జార్న్ ఫార్టుయిన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. దునిత్ వెల్లలాగేకు ఒక వికెట్ దక్కింది. 

ALSO READ | IND vs ENG: సూర్యను ఔట్ చేసిన కార్స్.. సన్ రైజర్స్‌కు శుభవార్త

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. రూట్ 78 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రథమమైన స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్‌ 129 పరుగులకే పరిమితమైంది. విల్ జాక్స్ 56 పరుగులు  చేసినా మిగిలిన వారు విఫలమయ్యారు.       

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)