Paatal Lok Season 2 X Review: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. పాతాల్ లోక్ సీజన్ 2 X రివ్యూ.. ఎక్కడ చూడాలంటే?

అమెజాన్ ప్రైమ్లో రిలీజైన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పాతాల్ లోక్ (Pathal Lok). ఇప్పుడీ ఈ సీజన్ పార్ట్ 2 ఓటీటీకి వచ్చేసింది. ఇవాళ శుక్రవారం జనవరి 17 నుంచి పాతాల్ లోక్ సీజన్ 2ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

 " పాతాల్ లోక్ సీజన్ 2కి స్వాగతం.. ఈ కొత్త సీజన్ అదిరిపోయే థ్రిల్లింగ్ అంశాలతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది" అంటూ ఓటీటీ వివరాలు వెల్లడించారు మేకర్స్. సుదీప్ శర్మ తెరకెక్కించిన ఈ సీజన్ 2 కోసం ఓటీటీ ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ 2025 కొత్త ఏడాది ఆ థ్రిల్లింగ్ని పెంచడానికి నేడు కొత్త సీజన్ అందుబాటులోకి వచ్చింది. క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్పై అనుష్క శర్మ ఈ వెబ్‌ సిరీస్‌ని నిర్మించింది. జైదీప్ అహ్లావత్ మరియు గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటించారు. 

పాతాల్ లోక్ సీజన్ 2 X రివ్యూ:

మొదటి సీజన్ లాగానే, సీజన్ 2 కూడా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. సీజన్2 కూడా అత్యంత ఇష్టపడే సిరీస్‌లో ఒకటని మరోసారి నిరూపించింది. ఈ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్ మరియు ఇష్వాక్ సింగ్ హాథీ రామ్ చౌదరి మరియు ఇమ్రాన్ అన్సారీగా వారి పాత్రలను తిరిగి పోషించడంతోపాటు ఆసక్తి పెంచారు. జైదీప్ అహ్లావత్ తన నటనతో సీరీస్కు బ్యాక్ బోన్గా బోన్గా నిలిచినట్లు నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

ట్రైలర్ రివ్యూ:

సిరీస్1లో లీడ్ రోల్ పోషించిన జైదీప్ అహ్లావతే కనిపిస్తాడు. అతను చెప్పే థియరీ ప్రేక్షకుల మైండ్కి పదునుపెట్టేలా ఉంది. లిఫ్ట్లో వెళుతున్న అతను ( జైదీప్ అహ్లావతే) ఓ కథ చెప్పాలా అని స్టార్ట్ చేసి.. ఒక్క ముక్కలో చెప్పిన థియరీ ఆసక్తి రేపుతోంది.

ALSO READ | 3 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ

"ఓ ఊళ్లో ఓ వ్యక్తి ఉంటాడు.. అతనికి పురుగులంటే అసహ్యం. ప్రపంచంలోనే అన్ని జాడ్యాలకు అవే కారణమని అతడు నమ్ముతాడు. ఒకరోజు అతని ఇంట్లోనే మూలకు ఓ పురుగు కనిపించింది. అది అందరినీ కుట్టింది. కానీ అతడు ఎలాగోలా దానిని చంపేశాడు. రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. కానీ అంతటితో కథ ముగియలేదు. కొన్ని వందల, వేల, లక్షల పురుగులు పుట్టుకొచ్చాయి. పాతాళ్ లోక్ అంటే ఒక్క పురుగే ఉంటుందా అంటూ జైదీప్ అహ్లావతే చెబుతూ ఉండటం థ్రిల్లింగ్ అయ్యేలా చేస్తోంది.

పాతాల్ లోక్ సిరీస్1 కథ విషయానికి వస్తే.. 

హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్).. 20 ఏళ్ల అనుభవం గల ఇన్ స్పెక్టర్. అతని చేతికి ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా(నీరజ్ కాబి) హత్య కేసు వస్తుంది. కెరీర్ లో మొదటి హైప్రొఫైల్ కేసు కావడంతో.. తన సబార్డినేట్ అన్సారీ(ఇష్వక్ సింగ్)తో కలిసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. దాని వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుసుకుంటాడు. ఆ హత్యా ఎవరు, ఎందుకు చేశారు? మధ్యలో CBI ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది? కేసు చివరకు ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన పాతాల్ లోక్ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్ లో రిలీజై సంచనలనం సృష్టించింది. 2020లో క్రైమ్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఒక్కో సీన్, ఒక్కో షాట్ ప్రేక్షకులను మైండ్ పోయేలా చేసింది. ఇక మధ్యలో వచ్చే ట్విస్టులకి పిచ్చెక్కిపోవడం ఖాయం. ఊహకందని స్క్రీన్ ప్లేతో దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆధ్యంతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.