కెప్టెన్సీ వద్దని ఎవ్వరూ అనరు

కెప్టెన్సీ వద్దని ఎవ్వరూ అనరు

పార్ల్‌‌‌‌ (సౌతాఫ్రికా): టీమిండియా కెప్టెన్‌‌‌‌గా ఫ్యూచర్‌‌‌‌లో తనకు అవకాశం ఇస్తే  దాన్ని తప్పకుండా అంగీకరిస్తానని,  ఇండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా చెప్పాడు. ‘ఒకవేళ నాకు ఆ చాన్స్​ (కెప్టెన్సీ) ఇస్తే దాన్ని గౌరవంగా భావిస్తా. కెప్టెన్సీ వద్దని ఏ ప్లేయర్‌‌‌‌ కూడా అనడు. నేనేమీ డిఫరెంట్‌‌‌‌ కాదు. అయితే, ఎవరి కెప్టెన్సీలో ఆడినా నా వరకూ బెస్ట్‌‌‌‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌‌‌లో ఇండియా వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అయిన బుమ్రా చెప్పాడు. ఏ సిచ్యువేషన్‌‌‌‌లో అయినా బాధ్యత తీసుకోవడంతో పాటు టీమ్‌‌‌‌మేట్స్‌‌‌‌తో మాట్లాడి వాళ్లకు హెల్ప్‌‌‌‌ చేయడం తనకు అలవాటు అని తెలిపాడు. ఇక, టెస్టు కెప్టెన్‌‌‌‌గా దిగిపోవడం విరాట్‌‌‌‌ కోహ్లీ పర్సనల్‌‌‌‌ డెసిషన్‌‌‌‌ అని, దాన్ని జడ్జ్‌‌‌‌ చేయకుండా  గౌరవించాలని బుమ్రా చెప్పాడు. ఇకపోతే, భారత జట్టు టెస్టు కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానెతోపాటు డాషింగ్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, కీపర్ రిషబ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి.