భద్రాచలం నుంచి అయోధ్యకు పాదయాత్ర

భద్రాచలం, వెలుగు : భద్రాచలం నుంచి అయోధ్య రామమందిరం వరకు రామపాదుకలతో పాదయాత్ర బుధవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధి నుంచి షురూ అయ్యింది. హైదరాబాద్ వాసి అయోధ్య భాగ్యనగర్​ సీతారామ ఫౌండేషన్​కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి రూ.91లక్షలతో 16 కిలోల బంగారు పూతతో ఈ వెండి పాదుకలకు విశాఖ శ్రీ సౌభాగ్య భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీరామానంద భారతిస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తుల జయజయధ్వానాల మధ్య పాదయాత్ర మొదలైంది. నాసిక్​, త్రయంబకేశ్వరం, చిత్రకూట్​, ప్రయాగ మీదుగా 75 రోజుల పాటు సుమారు 2వేల కిలోమీటర్ల పాదయాత్ర జరిగి జనవరి 15న అయోధ్య చేరుకుంటుంది. 22న అక్కడి రామాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.