కాంగ్రెస్​ పాదయాత్రలో కార్యకర్తల లొల్లి 

కాంగ్రెస్​ పాదయాత్రలో కార్యకర్తల లొల్లి 

మెదక్, వెలుగు : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలో భారత్​ జోడో సమ్మేళన్​ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఫొటో ఉండడంపై, టీపీసీసీ అధికార ప్రతినిధి  మ్యాడం బాలకృష్ణ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  బాలకృష్ణ అనుచరుడు రథం తాళం చెవి తీసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

పార్టీ హైకమాండ్​ ఇంకా ఇవరికి టికెట్​ కేటాయించలేదని, అలాంటప్పుడు  పార్టీ ప్రచార రథం మీద ఒకరి ఫొటోనే ఎలా పెట్టుకుంటారని బాలకృష్ణ అనుచరులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలను సముదాయించారు.  అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది.