కుంటాల మండలంలో వరి, జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కుంటాల మండలంలో వరి, జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కుంటాల/నర్సాపూర్ జి/జైపూర్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు మద్దతు ధర లభిస్తుందని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. బుధవారం కుంటాల మండలంలోని అందకుర్, అంబకంటితోపాటు నర్సాపూర్ జి మండలంలోని గొల్లమాడలోని పీఏసీఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి, జొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

 రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద న్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కుంటాలలో సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరాం, సీఈవో మురళీకృష్ణ, నాయకులు వెంగల్ రావు, రమణారావు,ఆప్క గజ్జరాం, మోతన్న, పృథ్వీ, లింగాదాస్ నర్సాపూర్ ​జిలో మాజీ ఎంపీపీ గజ్జరాం, పీఏసీఎస్ చైర్మన్ గజ్జరాం తదిత రులు పాల్గొన్నారు.

జైపూర్ మండలం టేకుమట్లలో..

మండలం లోని టేకుమట్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు 
చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ లీడర్లు, రైతులు పాల్గొన్నారు.