- ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
స్టేషన్‌ఘన్‌పూర్/ రఘునాథపల్లి/ బచ్చన్నపేట/ పర్వతగిరి, (సంగెం, గీసుగొండ), వెలుగు: ఉమ్మడి వరంగల్జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. శనివారం ఆయా నియోజకవర్గాల్లోని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎమ్మెల్యేలు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్మండలం నమిలిగొండ, చిల్పూరు మండలం రాజవరం సిరికాటన్ఇండస్ర్టీస్, చిల్పూరులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
రఘునాథపల్లి మండలం కంచనపల్లి పీఎస్సీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బచ్చన్నపేట మండలం కొడువటూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించగా, వరంగల్జిల్లా సంగెం మండలం చింతలపెల్లి, గీసుగొండ మండలం ఊకల్‌లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, వడ్ల తేమను పరిశీలించారు. వరంగల్జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్లులో నవజీవన్ సొసైటీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు బానోత్ వెంకన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు సూచించారు. వడ్లకు సన్న వడ్లకు రూ.500 పొందాలని, నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్ధతు ధర రూ.7521 పొందాలని తెలిపారు. ఆర్డీవో డీఎస్ వెంకన్న, జనగామ డీసీవో రాజేందర్ రెడ్డి, డీఆర్డీవో వసంత, డీసీఎస్వో సరస్వతి, మార్కెటింగ్ డీఎం హతిరామ్నాయక్, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల శిరీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, కంచనపల్లి సొసైటీలో జరుగుతున్న అవకతవకల గురించి ఎమ్మెల్యే కొంత అసహనం వ్యక్తం చేశాను. అవకాతవకలపై పూర్తి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.