మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • యాసంగిలో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగు

మెదక్, వెలుగు: యాసంగి 2024 –-25  సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  రైతులు యాసంగి సీజన్ లో  సాగు చేసిన వరి పంట కోతకు సిద్ధమైంది. ఏప్రిల్ ఆరంభంలో వరి పంట కోత, నూర్పిల్లు మొదలు కానున్నాయి. ఈ సీజన్ లో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులు ఇంటి అవసరాలకు, విత్తనాలకు పోను మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్, రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 480 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ నుంచి అవసరానికి తగ్గట్టుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

కలెక్టర్ సమీక్ష..

కలెక్టర్  రాహుల్ రాజ్, అడిషనల్  కలెక్టర్ నగేశ్ తో కలిసి సివిల్ సప్లై, కో ఆపరేటివ్, రెవెన్యూ, డీఆర్డీవో, ట్రాన్స్ పోర్ట్, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై రివ్యూ నిర్వహించారు. అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకం పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కలెక్టర్  పిలుపునిచ్చారు. రైతులు ధాన్యాన్ని తాలు లేకుండా తేమ శాతం 17 ఉండేలా చూసుకుని, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,320 , సాధారణ రకానికి రూ.2,300 నిర్ణయించినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకు రైతులు ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు.

అందుబాటులో పరికరాలు

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ వెల్లడించార్పాలిన్లురు. టా 14,919, తూకం వేసే యంత్రాలు 700, ప్యాడీ క్లీనర్లు 500, తేమ శాతం చూసే మెషీన్లు 700 అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.