- వరి కోతల సీజన్ లో రైతులు పడే ఇబ్బందులకు చెక్
- మెషీన్ ద్వారా ధాన్యం తేమ తగ్గింపు, తాలు తొలగింపు
- 20 నిమిషాల్లో ఒకేసారి 40 క్వింటాళ్ల వడ్ల క్లీనింగ్
- రాష్ట్రంలో తొలిసారి మెదక్జిల్లాలో అందుబాటులోకి..
మెదక్, వెలుగు: ప్రతి ఏటా వరి కోతల సీజన్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని కొనుగోలు కేంద్రాల్లో, రైస్‌మిల్లుల్లో తిరస్కరించడం చేస్తుంటారు. అంతేకాకుండా తాలు గింజలు ఉన్నాయని క్వింటాలుకు 5 –10 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు నష్టపోతుంటారు.
ఇక నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టడం, చెత్తా చెదారం, తాలు తొలగించడం రైతులకు సమస్యగా మారుతుంది. మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేస్తున్నా ధాన్యం పెద్దమొత్తంలో వస్తుండడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. దీంతో రైతులు రోజులు, వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తూ.. ధాన్యాన్ని అమ్ముకుంటుంటా రు.
ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్యాడి డ్రయర్మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్‌లో వ్యవసాయ పనిముట్లను తయారు చేసే ఓ కంపెనీ రూపొందించింది. రూ.13 లక్షల విలువైన ప్యాడి డ్రయర్మెషీన్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా మెదక్ జిల్లా టేక్మాల్రైతు ఉత్పాదక సహకార సంఘం(ఎఫ్‌పీవో) ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు.
గంటలోనే 6 శాతం మాయిశ్చర్ తగ్గింపు
ప్యాడి డ్రయర్మెషీన్ కెపాసిటీ 45 క్వింటాళ్లు. 20 నిమిషాల్లో వడ్లను లోడ్ చేసుకుని అందులోని చెత్తా, చెదారం, తాలు గింజలను తొలగిస్తుంది. ఆ తర్వాత డ్రయర్వడ్లలోని తేమ(మాయిశ్చర్)ను కూడా వేరు చేస్తుంది.
గంట వ్యవధిలో 6 శాతం మాయిశ్చర్తగ్గుతుంది. మెషీన్ ద్వారా ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించడం, తాలు గింజలు చెత్తా చెదారం తొలగించడం ఈజీ అవుతుంది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో ఇలాంటి ప్యాడి డ్రయర్మెషీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర సివిల్సప్లై కార్పొరేషన్కూడా ఆలోచన
చేస్తోంది.
మెదక్ మార్కెట్ యార్డులో మెషీన్ పరిశీలన
మెదక్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ప్యాడి డ్రయర్ మెషీన్ పని తీరును మెదక్ జిల్లా సివిల్సప్లై మేనేజర్హరికృష్ణ, జిల్లా సివిల్సప్లై ఆఫీసర్సురేశ్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్జనరల్ మేనేజర్భాస్కర్రావు, డీఎం సైదులు, రైస్మిల్అసోసియేషన్జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్సమక్షంలో పరిశీలించారు.
అనంతరం సివిల్సప్లై మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో మెయిన్, సబ్మార్కెట్యార్డులు కలిపి మొత్తం 9 ఉన్నాయని, అన్ని చోట్ల రైతుల సౌకర్యార్థం ప్యాడి డ్రయర్మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మెదక్ సొసైటీ చైర్మన్హన్మంతరెడ్డి, టేక్మాల్ఎఫ్ పీవో సీఈవో వెంకటేశం ఉన్నారు.