తరుగు పేరుతో మోసం చేయొద్దు

తరుగు పేరుతో మోసం చేయొద్దు

నర్సింహులపేట, వెలుగు: తరుగు పేరుతో రైతులను మోసం చేయొద్దని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం స్టేజి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు జినుకల రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సంపెట రాము, వైస్ చైర్మన్ బోబ్బా సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.