యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఈ నెల 22 నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెంలోని రైతువేదికలో గురువారం నిర్వహించిన మీటింగ్‌లో వడ్ల కొనుగోలులో పాటించాల్సిన రూల్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో 218, ఐకేపీ ఆధ్వర్యంలో 100 సెంటర్లు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. 17 శాతం కన్నా తక్కువ మాయిశ్చర్ ఉన్న వడ్లను మాత్రమే కొనాలని ఆఫీసర్లకు సూచించారు. వడ్లలో తేమ, తాలు లేకుండా నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం గోపీకృష్ణ, డీహెచ్‌ఎస్‌వో అన్నపూర్ణ పాల్గొన్నారు.
వడ్ల కొనుగోళ్లకు రెడీ కావాలి
కోదాడ/హుజూర్‌నగర్/నల్గొండ అర్బన్, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆఫీసర్లకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి డీసీవో శ్రీనివాస్ సూచించారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో గురువారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోదాడలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇందిర, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సీఈవోలు మంద వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో బొల్లేపల్లి అంజయ్య , బి.రాజశ్రీ, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సీఈవోలు మంత్రిప్రగడ జనార్దన్‌రావు, కీర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన మీటింగ్‌లో సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కెటింగ్, సివిల్ సప్లై, కో ఆపరేటివ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రతి రోజు సెంటర్లను సందర్శించాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర రైతులకు అందేలా చూడాలన్నారు.