
మెదక్ (శివ్వంపేట), వెలుగు: కాంటాపెట్టి 15 రోజులైనా వడ్ల పైసలు ఖాతాలో జమ కాలేదని శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దాదాపు 200 మంది రైతులు 9 వేల క్వింటాళ్ల వడ్లు అమ్మారని తెలిపారు. కాగా ఇప్పటి వరకు కేవలం 10 మంది రైతులకు మాత్రమే పైసలు వచ్చాయని,
మిగతా 190 మంది రైతులకు ఇంత వరకు పైసలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల పైసలు రాక హార్వెస్టర్ కిరాయి, పొలం నుంచి సెంటర్ కు వడ్లు రవాణా చేసిన ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వకపోవడంతో వారు తిడుతున్నారన్నారు. అలాగే వానాకాలం పంటల సాగుకు పొలాలు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది అవుతోందన్నారు.