
రేగొండ/ పర్వతగిరి, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, కొత్తగోరితండాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రారంభించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తహసీల్దార్ వెంకటస్వామి ప్రారంభించారు. రోళ్లకల్లు చెరువుముందు తండాలో నవజీవన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు.