
- వర్ధన్నపేట/ నర్సింహులపేట (మరిపెడ)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాలు శనివారం ప్రారంభమయ్యాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో, దమ్మన్నపేటలో పౌర్ణమి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీవోతో కలిసి ప్రారంభించారు. అనంతరం దమ్మన్నపేటలో సన్నబియ్యం అబ్ధిదారు మెరుగు రాధిక–రమేశ్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు భోజనం చేశారు.
మహబూబాబాద్జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఉకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి, కేశవాపూర్, దామెర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి
ప్రారంభించారు.