మక్తల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టర్మక్తల్మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు, రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. భూసమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా మీసేవా కేంద్రాల్లో అర్జీ పెట్టుకోవాలన్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను, స్కూళ్లను, నర్సరీలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. మక్తల్దగ్గరలోని దండు దగ్గర ఉన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం అక్కడున్న నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. నిర్వాహకులు గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మక్తల్, గుడిగండ్ల, జక్లైర్ బాయ్స్హైస్కూళ్లను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌లో పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్ నిర్వహించి గ్రామాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
జాతీయస్థాయి క్రీడల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ శ్రీహర్ష సన్మానించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్‌లో
జరిగిన సమావేశంలో టగ్ ఆఫ్ వార్, షూటింగ్ బాల్ క్రీడల్లో సత్తా చాటిన 20 మందిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఆఫీసర్లు హాథిరామ్, శివప్రసాద్, జాన్ సుధాకర్, తహసీల్దార్రాణా ప్రతాప్ సింగ్, ఎంపీడీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పోడు సమస్యలపై చర్చించండి
వనపర్తి, వెలుగు: పోడు భూముల పరిష్కారానికి అధికారులు గ్రామసభల్లో తీర్మానాలు చేసి నివేదికలను డివిజనల్ స్థాయి కమిటీకి అందించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పోడు భూముల సర్వే పై అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పక్కాగా వివరాలు నమోదు చేయాలన్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించామని వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లా ఫారెస్ట్ ఇన్చార్జి ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.
పరిశోధనల వల్లే రహస్యాలు తెలుస్తయ్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పరిశోధనల వల్లే విశ్వాంతరాల రహస్యా లు తెలుస్తాయని విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేశ్అన్నారు. బుధవారం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘వైజ్ఞానిక దృక్పథం, మానవ ప్రగతి’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మనం పాఠాల్లో చెప్పిన సైన్స్ సూత్రాలతో పరీక్షల్లో మార్కులు తెచ్చుకుంటున్నామని, కానీ వైజ్ఞానిక దృక్పథం పెంపొందించలేకపోతున్నామన్నారు. నేడు సోషల్‌మీడియాలో చేసే ప్రచారాలను సైన్స్ అనుకుని మోసపోతున్నామన్నారు. మహబూబ్ నగర్, నాగరకర్నూల్ డీఈవోలు రవీందర్, గోవిందరాజులు, పీయూ ప్రొఫెసర్ విశ్వనాథ్ , పట్టభద్రుల సంఘం కార్యదర్శి ఎన్.భరత్, నాయకులు సంతోష్ రాథోడ్ పాల్గొన్నారు.
లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో జిల్లా ఫస్ట్
ఉప్పునుంతల, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో నాగర్ కర్నూల్ జిల్లా ముందంజలో ఉందని ఎస్పీ మనోహర్యాదవ్అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఉప్పునుంతల పీఎస్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను, పీఎస్పరిసరాలను పరిశీలించారు. అనంతరం ‘హరితహారం’ లో భాగంగా పీఎస్‌లో మొక్క నాటారు. గ్రామాల్లో పెట్రోలింగ్పెంచడంతో పాటు ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట డీఎస్పీలు సత్యనారాయణ కృష్ణ కిషోర్, సీఐ అనుదీప్, ఎస్సై శేఖర్‌గౌడ్, సిబ్బంది ఉన్నారు.
అలైన్మెంట్లో అభ్యంతరాలుంటే చెప్పండి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజ్నంబర్–- 30, ఫుల్జాల హాజీపూర్ కెనాల్ అలైన్మెంట్ విషయంలో రైతులకు అభ్యంతరాలుంటే చెప్పాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో ప్యాకేజ్–-30లో భూములు కోల్పోతున్న రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలు, సూచనలను ఆర్డీవో ద్వారా రికార్డు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అభిప్రాయం మేరకు కాలువను ఊరికి పై భాగం నుంచి నడివెల్లి మీదుగా తీసుకెళ్లేందుకు సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ .. ప్రస్తుతం రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 15 వేల ఎకరాల ఆయకట్టుకే నీరందుతుందన్నారు. నడివెల్లి మీదుగా చంద్రసాగర్ చెరువును, ఇతర చెరువులను నింపితే 27 వేల ఎకరాలకు.. భూసేకరణ ఖర్చులు కూడా తక్కువ అవుతాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కల్వకుర్తి, అచ్చంపేట ఆర్డీవోలు రాజేశ్‌కుమార్, పాండు నాయక్, ఇరిగేషన్ ఈఈ సంజీవ్ రావు, రైతులు పాల్గొన్నారు.
దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకెళ్లాలి
దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ లో దివ్యాంగుల క్రీడాపోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రై సైకిల్, జావలిన్ త్రో, చెస్, క్యారమ్స్, షార్ట్ పుట్, 50 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాలు, ట్రై సైకిల్ ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఇన్చార్జి ఆఫీసర్దమయంతి, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్
పాల్గొన్నారు.
రామన్నగట్టు రిజర్వాయర్ తో సస్యశ్యామలం
పానగల్, వెలుగు: రామన్న గట్టు రిజర్వాయర్ తో పానగల్సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం పానగల్ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రైతు వేదికలో 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజకీయాలపై అవగాహన లేని వారు కూడా తనపై సోషల్ మీడియాలో కామెంట్చేస్తున్నారని, అలాంటి కామెంట్లకు తాను స్పందించనన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ పన్నిన కుట్రను భగ్నం చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడి కొల్లాపూర్ ఆత్మగౌరవాన్ని పెంచానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘గువ్వల’ అవినీతిని ఎండగట్టండి
అచ్చంపేట, వెలుగు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ సూచించారని అచ్చంపేట బీజేపీ లీడర్సతీశ్మాదిగ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో బండి సంజయ్‌ని కలిసిన సతీశ్మాదిగ అనంతరం మీడియాతో మాట్లాడారు. టూరిజం డెవలప్మెంట్పేరుతో ప్రతాపరుద్రుడి కోటలో, బౌరంపురం ఆలయంలో ఎమ్మెల్యే గుప్త నిధుల తవ్వకాల చేశారని సంజయ్‌కు వివరించానన్నారు. అమాయక ప్రజల మీద ఎమ్మెల్యే దాడులు, గద్వాల బీజేపీ కార్యకర్తను పట్టుకొచ్చి అచ్చంపేట పీఎస్ లో చిత్రహింసలు పెట్టిన విషయాలను సంజయ్అడిగి తెలుసుకున్నారన్నారు. 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు తర్వాత, అచ్చంపేట నల్లమల కు వస్తానని సంజయ్చెప్పారన్నారు.
ఆఫీసర్ల ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టిన్రు..
ఎమ్మెల్యే తీరుపై బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల ఫైర్
గద్వాల, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురుకులాల ఇన్చార్జి కోఆర్డినేటర్ పై దాడి చేసి, ఆఫీసర్ల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం వారు పట్టణంలో ప్రెస్మీట్నిర్వహించారు. సొంత పార్టీ జడ్పీ చైర్‌పర్సన్‌పై అసూయతో ఆఫీసర్‌ను బలిపశువు చేశారన్నారు. గతంలో డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కృష్ణమోహన్‌రెడ్డి మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా వ్యవహరించారన్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నడు
ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అధికారం కోల్పోతానని అసహనంతో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్నారు. ఆఫీసర్ పై దాడి చేసిన ఆయనపై ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ ప్రెసిడెంట్పటేల్ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులను తప్పించి అమాయకుల పిల్లలు జైలుకు పంపాడని ఆరోపించారు. అది మరువక ముందే గురుకుల స్కూల్ప్రారంభోత్సవంలో అధికారి కాలర్‌పట్టి నెట్టేయడం దుర్మార్గమన్నారు. నాయకులు బలిగెర నారాయణరెడ్డి, వీరబాబు, ఎండీ గౌస్ పాల్గొన్నారు.
‘ధరణి’ సమస్యలు పరిష్కరించాలని నేడు ధర్నా
అయిజ, వెలుగు: ధరణి పోర్టల్సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ.. పీసీసీ పిలుపు మేరకు ఈ నెల 24న తహసీల్దార్ఆఫీస్ల ఎదుట ధర్నా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీఓబీసీ స్టేట్ సెక్రెటరీ షెక్షావలి ఆచారి తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైతుల పాలిట శాపంగా మారిన ‘ధరణి’ని సరిచేసేవరకు ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు జయన్న, మద్దిలేటి, మధు, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్లలో కళానైపుణ్యాలను పెంచాలి
వనపర్తి, వెలుగు: స్టూడెంట్లలో కళానైపుణ్యాలను పెంచాలని, దాంతో వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని జిల్లా ఏఎంవో ఎస్.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏఎంవో మాట్లాడుతూ ఒక్కో స్టూడెంట్ లో ఒక్కో రకమైన కళ దాగిఉంటుందని ఇలాంటి కళానైపుణ్యాలను వెలికి తీసేందుకు ఏటా ‘కళాఉత్సవ్’ నిర్వహిస్తున్నామన్నారు. స్టూడెంట్లు చేసిన డ్యాన్స్, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. జీహెచ్ ఎం లు గణేశ్ కుమార్, శంకరయ్య, ప్రభాకర్, సుజాత, శివలింగం పాల్గొన్నారు.
ఘనంగా కళా ఉత్సవ్పోటీలు
నారాయణపేట, వెలుగు: స్టూడెంట్లలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు తోడ్పడుతాయని డీఈవో ఎం. గోవిందరాజు అన్నారు. బుధవారం పట్టణంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో బాలకేంద్రంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. హాజరైన ఆయన ముందుగా సరస్వతీ దేవి ఫొటోకు పూజలు చేశారు. అనంతరం శాస్త్రీయ, జానపద పాటలపై చిన్నారులు చేసిన డ్యాన్సులను, ఆటబొమ్మల తయారీని పరిశీలించారు. ఎంఈవో గోపాల్ నాయక్, ఏఎంవో విద్యాసాగర్ పాల్గొన్నారు.
రిజర్వాయర్ ని రద్దు చేయాలి
కలెక్టర్ ను కోరిన నిర్వాసితులు
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల స్కీమ్‌లో భాగంగా 101 ప్యాకేజీ లో నిర్మిస్తున్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ కి ఎలాంటి ఆయకట్టు లేదని, ఆ రిజర్వాయర్ ను రద్దు చేయాలని చిన్నోనిపల్లి నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ నిర్వాసిత రైతులతో, ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపు 300 రోజుల నుంచి రిజర్వాయర్ రద్దు కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కు 1,000 లెటర్లు రాశామన్నారు. 2005లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో చాలామంది రైతులు ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని, వాటిని తీసుకుంటే వారికి ఉపాధి లేకుండా పోతుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన 2,464 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలన్నారు.
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలి
రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు సహకరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే కొత్తగా 3,500 ఎకరాలకు సాగు నీరందుతుందని, ఆర్డీఎస్ కింద కూడా 12,500 ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ మీటింగ్ లో ఆర్డీవో రాములు, ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
‘గువ్వల’ అవినీతిని ఎండగట్టండి
అచ్చంపేట, వెలుగు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ సూచించారని అచ్చంపేట బీజేపీ లీడర్సతీశ్మాదిగ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో బండి సంజయ్‌ని కలిసిన సతీశ్మాదిగ అనంతరం మీడియాతో మాట్లాడారు. టూరిజం డెవలప్మెంట్పేరుతో ప్రతాపరుద్రుడి కోటలో, బౌరంపురం ఆలయంలో ఎమ్మెల్యే గుప్త నిధుల తవ్వకాల చేశారని సంజయ్‌కు వివరించానన్నారు. అమాయక ప్రజల మీద ఎమ్మెల్యే దాడులు, గద్వాల బీజేపీ కార్యకర్తను పట్టుకొచ్చి అచ్చంపేట పీఎస్ లో చిత్రహింసలు పెట్టిన విషయాలను సంజయ్అడిగి తెలుసుకున్నారన్నారు. 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు తర్వాత, అచ్చంపేట నల్లమల కు వస్తానని సంజయ్చెప్పారన్నారు.
స్టూడెంట్ల హెల్త్ సమస్యలపై జాగ్రత్తలు పాటించాలి
కందనూలు, వెలుగు: స్టూడెంట్ల హెల్త్సమస్యలపై జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం బిజినేపల్లి మండలం పాలెం హెల్త్ అండ్ మెడికల్ఆఫీస్లో గురుకులా ల ప్రిన్సిపాల్లు , హాస్టల్వార్డెన్లు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎం లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన డీఎంహెచ్‌వో సుధాకర్లాల్మాట్లాడుతూ గురుకుల, హాస్టల్ స్టూడెంట్లు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. అంటు వ్యాధులతో పాటు చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధ వ్యాధుల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జిల్లా సోషల్వెల్ఫేర్ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.