![ఎమ్మెల్యే ప్రమాణం చేస్తుండగా..డాడీ.. ఐ లవ్ యూ అంటూ కేకలు](https://static.v6velugu.com/uploads/2023/12/padi-kaushik-reddy-daughter-says-i-love-you-daddy-in-assembly_jpAI7is8fG.jpg)
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూ తురు చేసిన పనికి పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న టైమ్‌లో ‘డాడీ.. ఐ లవ్ యూ’అంటూ గట్టిగా అరవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గురువారం ఉద యం సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కౌశిక్‌రెడ్డిని అసెంబ్లీ సెక్రటరీ పిలిచిన వెంటనే విజిటర్స్ గ్యాలరీ నుంచి ఆ అమ్మాయి మీడియా గ్యాలరీలోకి వచ్చింది.
కౌశిక్ ప్రమాణం చేస్తుండగా ‘డాడీ.. ఐ లవ్ యూ’అంటూ కేకలు వేసింది. దీంతో సభలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా గ్యాలరీ వైపు తిరిగి చూశారు. గ్యాలరీలో ఉన్న మార్షల్స్ తేరుకునే లోపే ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎమ్మెల్యే కూతురు కావడంతో తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని మీడియాకు మార్షల్స్ చెప్పినట్లు తెలిసింది. విజిటర్స్‌ను గ్యాలరీలోకి అనుమతించడానికి ముందే, గ్యాలరీలో ఎలా ఉండాలో మార్షల్స్ సూచనలు చేస్తారు. అలా అరవడంతో గ్యాలరీలోని రిపోర్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.