తన పాత ఫోటోలు పెట్టి.. రేవంత్ రెడ్డిని కలిసినట్లు దుష్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు నమ్మవద్దని ప్రజలకు వివరించారు.
హుజూరాబాద్ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి.. ప్రజల మెప్పును పొందుతానన్నారు. అదేవిధంగా కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆయన కోరారు.