
సీఎం కేసీఆర్ ను కలవడానికి తనకు అపాయింట్ మెంట్ కూడా అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ అభివృద్ధి విషయంలో కేసీఆర్ తనకు అండగా ఉంటారని తెలిపారు. హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో మినీ స్టేడియం నిర్మాణానికి పాడి కౌశిక్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎంని కలవడానికి తనకు, వినోద్ కుమార్ కి అపాయింట్ మెంట్ కూడా అవసరం లేదన్నారు.
హుజురాబాద్ జిల్లా కాకుండా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడ్డుకున్నారని.. ఫ్యూచర్ లో జిల్లా అవుతుందన్నారు కౌశిక్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే 1000 కోట్లతో హుజురాబాద్ అభివృద్ధి చేస్తానన్నారు. మినీ కలెక్టరేట్.. మోడల్ చెరువును టూరిజం స్పాట్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని.. త్వరలో హుజురాబాద్ లో జరగబోయే బహిరంగ సభలో సీఎంతో చెప్పిస్తానన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని.. హుజురాబాద్ లో అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే ఏం లాభమన్నారు. తనకు కోపం ఎక్కువని పుకార్లు చేస్తున్నారని.. పనుల కోసమే అధికారులపై కోపడ్డానని.. అది ప్రజల కోసమేనని తెలిపారు.