నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేటలోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో శనివారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పుష్పాభిషేకం, దివ్య పడిపూజ మహోత్సవం, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని అలంకరించి గజమాలతో ధనాభిషేకం నిర్వహించారు.
మాలాధారుల కీర్తనలు, శరణుఘోషతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, మాదారపు చంద్రశేఖర్, దొడ్డా రవీందర్, శ్రీరాం ఈశ్వరయ్య, చింతల కమలాకర్‌రెడ్డి, శ్రీరాముల శంకరయ్య, ఆకుల ప్రభాకర్ పాల్గొన్నారు.
మాలధారులకు అన్నదానం
కమలాపూర్, వెలుగు : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన బాలసాని శ్రీనివాస్‌గౌడ్ రమాదేవి కుమారుడు సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప ఆలయంలో శనివారం మాలధారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రిషిత, గురుస్వాములు రాజు, అశోక్, పెరమాళ్ల సమ్మయ్య, రాజయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.