విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తుల రాస్తారోకో

విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తుల రాస్తారోకో

ఆసిఫాబాద్, వెలుగు: నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉంటున్నామని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ మండలం పాడిబండ గ్రామస్తులు బుధవారం వట్టి వాగు కాలనీ రోడ్డుపై రాస్తా రోకో చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు కరెంట్ ట్రాన్స్​ఫార్మర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా పాడిబండ గ్రామ పంచాయతీ పరిధిలోని 11 గ్రామాలకు కరెంట్​సరఫరా నిలిచిపోయింది.

రాత్రి వేళ అంధకారంలో ఇబ్బందులు పడుతున్నామని, అయినా విద్యుత్​ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆదివాసి సేన ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సీడం కైలాశ్ మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కరెంట్ సరఫరా చేయాలని  కోరారు.