Padma awards : రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం 

Padma awards : రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం 

పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఇవాల (మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. 2023కుగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ కర్, ప్రధాని మోడీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రముఖులకు ముర్ము పద్మ అవార్డులు అందించారు. 9 మందికి పద్మభూషన్, 91 మందికి పద్మ అవార్డులు దక్కాయి.

కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణకు పద్మ విభూషణ్‌, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, సింగర్‌ సుమన్‌ కళ్యాణ్‌పూర్‌లకు పద్మ భూషణ్‌ అవార్డులు లభించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం, ఆంధ్రప్రదేశ్), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం, ఆంధ్రప్రదేశ్),  తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్‌), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం)లు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌ మంగళ కాంతా రాయ్‌ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.

పాండ్వానీ సింగర్‌ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్‌ చితారా, పంజాబీ స్కాలర్‌ డాక్టర్‌ రతన్‌ సింగ్‌ జగ్గీ, స్టాక్‌ మార్కెట్‌ నిపుణుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా(దివంగత)  త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్‌ ప్రీతికాకా గోస్వామి, బయాలజిస్ట్‌ మోడడుగు విజయ్‌ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. కళాకారుడు దిల్‌షద్‌ హుస్సేన్‌ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అఅందుకున్నారు.