ఢిల్లీ: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను శనివారం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన కొందరిని ఈ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడా రంగం, కళా రంగం, వ్యవసాయం, వైద్య వృత్తిలో సేవలందించిన ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి.
మొత్తం 139 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 139 మందిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉండటం గమనార్హం. ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు జాబితా ఇలా ఉంది.
పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు జాబితా ఇది:
- విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
- వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
- నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్
- జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
- జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్
- హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా
- భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) బిహార్
- పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
- ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్
- సురేశ్ సోనీ (సోషల్‌వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
- రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
- పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్
- లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
- బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
- షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
- నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
- హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
- జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్