దేశ చరిత్రలోనే...ఒకే గ్రామానికి రెండు పద్మ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.  వీరిలో బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య,కళావిభాగంలో వేలు ఆనందాచారి, విద్యాసాహిత్యం రంగాల్లో కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. 

వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరికి రావడం చాలా సంతోషకరం. ఇది నేటి తరాలకు స్పూర్తి దాయకం. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, బొల్లేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ సోంలాల్ .. రామన్నపేట మండలం, ఎల్లంకి గ్రామానికి చెందిన శ్రీ కూరెల్ల విఠలాచార్యకు పద్మ అవార్డులు రావడం, గ్రామీణ నేపథ్యం నుండి జాతీయ స్థాయి అవార్డులు రావడం వారి కృషికి నిదర్శనం. 

గతంలో బొల్లేపల్లి గ్రామానికి చెందిన రావినారాయణ రెడ్డికి పద్మవిభూషన్  అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.  లేటెస్ట్ గా అదే గ్రామానికి చెందిన   కేతావత్ సోమ్లాల్ కు పద్మశ్రీ అవార్డు దక్కింది. దీంతో ఒకే గ్రామానికి చెందిన వారికి రెండు పద్మ అవార్డులు రావడం దేశ చరిత్రలోనే మొదటి సారని రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ వెల్లడించింది.