
పాపన్నపేట, వెలుగు : తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని, అభివృద్ధి చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆమె మండలంలోని ముద్దాపురం, రామతీర్థం, నర్సింగరావుపల్లి తండా, మెదులకుంట తండా, కందిపల్లి, అమ్రియ, సోమ్లా తండా, లింగాయిపల్లి, చీకొడ్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా గ్రూపు మహిళలకు నెలకు రూ.3000 అందిస్తామన్నారు. 400లకే గ్యాస్ సిలిండర్, రేషన్‌ద్వారా సన్నబియ్యం, ఎకరాకు రూ.16000 వేల రైతు బంధు ఇస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోని వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు మొదలవుతాయన్నారు. మైనంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుబేరు, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, సర్పంచ్లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, మల్లేశం, లక్ష్మీదుర్గయ్య, దానయ్య, నవీన్, రాణికిష్టయ్య, సాయిరెడ్డి, బాబాగౌడ్ పాల్గొన్నారు.
యువకుడి హల్‌చల్
మండలంలోని అమ్రియా తండాలో ప్రచారానికి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి ని ఓ యువకుడు ప్రశ్నిస్తుండగా కొంతమంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు సూసైడ్ చేసుకుంటానంటూ ట్రాన్స్ఫార్మర్ గద్దె ఎక్కాడు. వైర్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా గద్దెపై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పాపన్నపేట పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నర్సింగరావు పల్లితండాలో యువకులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని నిలదీశారు. ఉద్యోగాలు రాక చదువుకొని వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెదులకుంట తండాలో మోరీలు లేక రోడ్లపై మురికి పారుతుందని మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా దాటవేశారు.
Also Read :- బరిలో వీళ్లే..ఏయే పార్టీ తరఫున ఎవరెవరు?