
మెదక్ టౌన్, వెలుగు : ప్రజా సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేసి చూపించామన్నారు. మెదక్ లో తనను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్య, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, హవేళీ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.