- పార్టీలు అవకాశమిస్తే పోటీకి సిద్ధం
జనగామ, వెలుగు: అవకాశమిస్తే పార్లమెంట్ఎన్నికల్లో వరంగల్ సెగ్మెంట్ నుంచి ఎంపీకి బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పేర్కొన్నారు. జనగామలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిందు యక్షగాన కళాకారుడిగా తాను సుమారు 20 వేల ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చానని, తానే ప్రజాప్రతినిధిని అయితే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.