హైదరాబాద్‌సిటీ, వెలుగు : బంజారా హిల్స్ రోడ్ నంబర్1లోని లేబుల్స్ పాప్-అప్ స్పేస్ లో ఏర్పాటు చేసిన ‘డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి నృత్యకారిని డాక్టర్ పద్మజారెడ్డి ఆదివారం ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు ముఖ్యంగా పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకచోట ప్రదర్శించడం అభినందనీయమన్నారు.
డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ.. నేత కార్మికులను ప్రోత్సహించడంతోపాటు చేనేత పరిశ్రమకు మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ నెల 22 వరకు ఎగ్జిబిషన్కొనసాగుతుందని తెలిపారు.