హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) లో ప్రిన్సిపల్ చీఫ్ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) గా పద్మజ నియమితులయ్యారు. బుధవారం రైల్ నిలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. జోన్ చరిత్రలోనే పీసీఓఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళాగా రికార్డు సృష్టించారు.
ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్– 1991వ బ్యాచ్‌కి చెందిన పద్మజ ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీఓఎం) గా విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వేలో గత 30 ఏండ్ల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గతంలో సికింద్రాబాద్, గుంతకల్లు డివిజన్ లో, రైల్ నిలయంలో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/కోచింగ్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, జనరల్, చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ వంటి పదవులు నిర్వహించారు.