‘పద్మాలయ’ భూములు వెనక్కి తీస్కోవాలి

  • గవర్నర్‌‌‌‌కు  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్, వెలుగు: పద్మాలయా స్టూడియో నిర్మాణానికి సర్కారు ఇచ్చిన భూములను జీ టెలీఫిల్మ్స్‌‌కు స్టూడియో నిర్వాహకులు అమ్మారని ఫోరం ఫర్‌‌‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. స్టూడియో నిర్వాహకులు రూల్స్‌‌కు విరుద్ధంగా ల్యాండ్ అమ్మారని హైదరాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌‌‌‌ రిపోర్టు ఇచ్చారని, ఆ ల్యాండ్స్‌‌ తిరిగి తీసుకోవాలని సీసీఎల్‌‌ఏ 2014లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు గవర్నర్‌‌‌‌ తమిళి సైకు పద్మనాభరెడ్డి సోమవారం లెటర్ రాశారు. సీసీఎల్‌‌ఏ రిపోర్టు ఇచ్చి ఏడేండ్లు గడిచిందని, ఇప్పటివరకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోలేదని లెటర్‌‌‌‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి 

ఏపీలో రూ.23,500.. తెలంగాణలో రూ.15 వేలే

మార్కుల లెక్క తేలకుండానే మెరిట్ జాబితా విడుదల

తెలంగాణ, ఏపీ ఇంటర్‌‌ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం