తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా గజ్వేల్ .. ఎందుకంటే ఇక్కడి నుండి సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పోటీ చేయడమే. దీంతో గజ్వేల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే కేసీఆర్ పై పోటీ చేసేందుకు పక్క రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూడా బరిలో దిగబోతున్నాడు.
తమిళనాడు రాష్ట్రంలోని సెలంకు చెందిన పద్మరాజన్ (66) అనే వ్యక్తి గజ్వేల్లో స్వతంత్ర అభ్యర్థిగాఈ రోజు నామినేషన్ వేశాడు. మొత్తం ఈ రోజు రెండు నామినేషన్లు దాఖలవ్వగా అందులో ఇద్దరూ స్వతంత్రులే కావడం విశేషం. పద్మరాజన్ ఎలక్షన్స్ కింగ్ అని పిలుస్తుంటారు.
ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్యేల ఎన్నికల్లో 236 నామినేషన్లు వేశాడు. ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి 237 వ నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు.
కాగా గజ్వేల్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి నర్సారెడ్డిలు బరిలో ఉన్నారు.