
పద్మారావు నగర్, వెలుగు: తల్లికి దశ దిన కర్మ ఘనంగా చేయాలనుకున్న ఓ యువకుడు డబ్బులు లేకపోవడంతో గంజాయి విక్రయించాడు.. సులువుగా డబ్బులు వస్తుండటంతో ఆ పనిని కొనసాగిస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్ వివరాల ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా చౌదానగర్ కు చెందిన బెంజిమిన్ గమాంగో వ్యవసాయం చేసేవాడు.
3 నెలల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె దశదిన కర్మకు బంధువులు, తెలిసినవారందరినీ పిలవాలనుకున్నాడు. రూ.40 వేలైనా కావాలనుకొని, ఒక ప్లాన్ వేశాడు. అక్కడి అడవ ఫారెస్టుకు వెళ్లి, గంజాయి కొనుగోలు చేశాడు. దాన్ని మహారాష్ట్రలోని పుణేలో అధిక ధరకు విక్రయించాడు. ఇలా వచ్చిన డబ్బులతో తల్లి కర్మ ఘనంగా చేశాడు. సులువుగా డబ్బులు వస్తుండటంతో ఆ తర్వాత కూడా గంజాయి అమ్మకాన్ని కొనసాగిస్తున్నాడు.
పద్మారావు నగర్, వెలుగు: తల్లికి దశ దిన కర్మ ఘనంగా చేయాలనుకున్న ఓ యువకుడు డబ్బులు లేకపోవడంతో గంజాయి విక్రయించాడు.. సులువుగా డబ్బులు వస్తుండటంతో ఆ పనిని కొనసాగిస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్ వివరాల ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా చౌదానగర్ కు చెందిన బెంజిమిన్ గమాంగో వ్యవసాయం చేసేవాడు. 3 నెలల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె దశదిన కర్మకు బంధువులు, తెలిసినవారందరినీ పిలవాలనుకున్నాడు. రూ.40 వేలైనా కావాలనుకొని, ఒక ప్లాన్ వేశాడు. అక్కడి అడవ ఫారెస్టుకు వెళ్లి, గంజాయి కొనుగోలు చేశాడు. దాన్ని మహారాష్ట్రలోని పుణేలో అధిక ధరకు విక్రయించాడు. ఇలా వచ్చిన డబ్బులతో తల్లి కర్మ ఘనంగా చేశాడు. సులువుగా డబ్బులు వస్తుండటంతో ఆ తర్వాత కూడా గంజాయి అమ్మకాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నెల14 అడవ ఫారెస్టుకు వెళ్లి, 4 కిలోలు కొన్నాడు. విశాఖ ఎక్స్ప్రెస్రైలెక్కి, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగాడు. పుణే వెళ్లే రైలు కోసం వేచిచూస్తుండగా.. అక్కడే ఉన్న పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని తనిఖీ చేయగా గంజాయి దొరికింది. బెంజిమిన్ గమాంగోను అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.ఈ నెల14 అడవ ఫారెస్టుకు వెళ్లి, 4 కిలోలు కొన్నాడు. విశాఖ ఎక్స్ప్రెస్రైలెక్కి, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగాడు. పుణే వెళ్లే రైలు కోసం వేచిచూస్తుండగా.. అక్కడే ఉన్న పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని తనిఖీ చేయగా గంజాయి దొరికింది. బెంజిమిన్ గమాంగోను అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.