
ముషీరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేయాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్క దేవదాస్ పిలుపునిచ్చారు. 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 8వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. గురువారం చిక్కడపల్లిలోని స్టేట్ఆఫీసులో పద్మశాలి మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి పద్మశాలీలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.