టెన్త్​ స్టూడెంట్లకు ప్యాడ్లు అందజేత

కడెం, వెలుగు: కడెం మండలంలోని లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని 77 మంది టెన్త్​ క్లాస్​ స్టూడెంట్లకు లింగాపూర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఆకుల బాలవ్వ, గౌరవ అధ్యక్షుడు దానవేణి మల్లేశ్, అధ్యక్షులు బొమ్మిడి మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఉప్పులూటి గంగారాం, శేఖర్, హెచ్ఎం వెంకటరమణ, టీచర్లు పాల్గొన్నారు.